క్షణము కదలినప్పుడల్లా
ఒడ్డును చేరే ఓ అల
ప్రతిక్షణం నీవు
సాగరాన్ని విడిచి వచ్చేది ఎవరికోసం ?
గాలి వీచినప్పుడల్లా
రవిని కమ్మేసె ఓ మేఘమా
కాలుతూ నీవు
నీడను ఇచ్చేది ఎవరికోసం ?
ఆకులు రాలినప్పుడల్లా
కొయిలతొ పలికించె ఓ వసంతమా
కొత్తదనానికి నీవు
పచ్చతనాన్ని తెచ్చేది ఎవరికోసం ?
.