నెలవంకతో స్నేహంకోరి,
నీలి మేఘాలు నడిచి వస్తే
తారలన్నీ అసూయతో
తొంగి చూసాయి ...
ఇంటికి రమ్మంటూ
చీకటి మబ్బులు
వెండి వెలుగులకు కబురు చేస్తే
వెలుగులన్నీ నావేనంటూ
జాబిల్లి కళ్ళు చిలిపి చేసాయి ....
మాయలో ముంచిన
మంత్రమేమో చెలి నీవు ...
నిన్ను చూడగా అందరూ ఊరుకున్నారు ...
వెన్నలవో వర్శానివో
మనసును తడిపే తోలి చినుకువో
నా కవితలకు గమ్యానివో
తెలియకున్నాను సఖి.... !
