Sunday, November 17, 2013
Sunday, September 29, 2013
మౌనవేదం...!!
దూరతీరాల బ్రతుకు దారిలొ
కాసేపు ఆగేలా
ఆగిన చోటే నిలిచేలా
మాయచేసి ఓర్పును నేర్పును జీవితం ....!
పడీ లేచి; పడీ లేచె జీవితంలొ
ఓటమిని మరిచేలా
రేపటికోసం కలలను దాచేలా
నెమ్మదిగా ఓదార్పును పంచేను నమ్మకం ....!
అబద్దాలు నిజాలుగా; నిజాలు అబద్దాలుగా మారె నమ్మకంలొ
మంచికోసం వేచిచూసేలా
ఆత్మబలాన్ని నమ్మేలా
మౌనవేదం పలికేను లోన దాగున్న దైవం ....!
Sunday, August 11, 2013
మధుస్నానం మహాశివునికి!
బుసలుగొట్టి
భుజములను చేరినాడు విషనాగుడు!
పడగలెత్తి
విషపు గాలులను విడిచినాడు
విషపు గాలికి వీపు కందినదేమో
చల్లగ జరగని మహాశివునికి మధుస్నానము ...
మధువుకోసం
సాగరాన్ని చిలికిననాడు
అరచెతిలొ
విషము మొత్తము త్రాగినాడు
చేదునంతా గొంతులోనె భరించెనేమో
తియ్యగా జరగని మహాశివునికి మధుస్నానము...
తపసులొ
మదిని కదిలించిన మనుమథుని కాల్చినాడు
చూపులోనే
నిప్పులను కురిపించినాడు
నిప్పు వేడికి నుదుడు కందెనేమో
చల్లగ జరగని మహాశివునికి మధుస్నానము...
చల్లగ సాగేను లోకము ...
Sunday, July 7, 2013
Sunday, May 26, 2013
Wednesday, April 24, 2013
Saturday, March 9, 2013
ఆగని అమానుషం!!
గుండె లయలొ నిండిపోయి
మొదటి మాటలొ కలిసిపోయిన మధుర కావ్యం - "అమ్మ" !
కలిసి ఉండె కలకాలం
ప్రేమలో అమ్మకు సాటి ఈమె - "సోదరి" !
కళ్ళముందు కదిలె రంగుల కలలొ
విరిచిన కొత్త కవితలోని వింత మోహం - "చెలియ" !
ఒకటై నడిచె ఏడు అడుగులలొ
కలిసి పాడిన జీవనరాగం - "భార్య" !
స్త్రీ లేని జీవితం ఓ అబద్దం !!
నేడే ఆగాలి ఈ అమానుషం!
Wednesday, February 13, 2013
ప్రేమికుల మాట....!!
కంట ఒడిలో విరిసిన కల
తిరుగుతూ తాను అలిసేనా ....
నీటిపై వాలిన చల్లని నీడ
కదులుతూ తాను తడిసేనా ....
కెరటాలు ఎత్తుకు ఎగసిపడినా
అవి, కడలి చేరుట మరిచేనా ....
చుక్కలు ఎన్ని వెలిగిపోయినా
గగనం, చందమామ చేతిని విడిచేనా ....
లేఖలు నీకు ఎన్ని రాసినా
నాలోని నీపై ప్రేమ ముగిసేనా ....
నీ ఎదురు నేనెంత మూగబోయినా,
నాలోని బాసలు ఆగేనా ....
ఏమైనా .....ఎప్పటికైనా ....నిన్ను నే విడిచేనా ....
Monday, January 28, 2013
ఏమంటారు...??
సంధ్యవేళకి సూరీడు తప్పుకుంటె
చీకటి మబ్బులు కమ్ముకోవడం .....ఎంత నిజమో
చుక్కల్లో, చంద్రుడు వెలిగిపోవడం .....అంతే నిజం !!
నవ్వులు వాడి పువ్వులు రాలిపొతె
లేత మనసులు మూగబోవడం .... ఎంత నిజమో
కొత్త కలతో లేత మోగ్గులు పుయ్యడం ....అంతే నిజం !!
మండే ఎండకి నీరంతా నింగిని చేరితె
చెరువు, దాహానికి చేరువ కాకపోవడం .... ఎంత నిజమో
చినుకు రాలి, చెట్టుకి చిగురు తొడగడం ....అంతే నిజం !!
ఒకటికోసం మరొకటి ....
జరిగేదంతా మంచికి .... ఏమంటారు ??
Tuesday, January 1, 2013
అలా మొదలైంది...!!
నింగిలో చుక్కలెన్నో చెల్లినారు
ఏ రాజుగారి దారికొ ....!
మేఘాల గొడుగులెన్నో పట్టినారు
ఏ రాణిగారి నీడకొ ....!
జాజికొమ్మలు పాడె జోల పాటలు
అలసిన ఏ తోటమాలికొ ...!
జామురాతిరి నిండువెన్నెల మౌనం
ఏ కవిలోని రాగమాలికొ...!
ఏమిటొ ఈ వింత అనుకున్న క్షణం శుభాకాంక్షలతొ వచ్చింది క్రొత్త సంవత్సరం!!
ఇలా ఉండిపోవాలి ఈ క్షణం ...!
Subscribe to:
Comments (Atom)








