Wednesday, February 13, 2013

ప్రేమికుల మాట....!!


కంట ఒడిలో విరిసిన కల 
తిరుగుతూ తాను  అలిసేనా ....

నీటిపై వాలిన చల్లని నీడ
కదులుతూ తాను  తడిసేనా ....

కెరటాలు ఎత్తుకు ఎగసిపడినా
అవి, కడలి చేరుట మరిచేనా ....

చుక్కలు ఎన్ని వెలిగిపోయినా
గగనం, చందమామ చేతిని విడిచేనా ....

లేఖలు నీకు ఎన్ని రాసినా
నాలోని నీపై ప్రేమ ముగిసేనా ....

నీ ఎదురు నేనెంత మూగబోయినా,
నాలోని బాసలు ఆగేనా ....

ఏమైనా .....ఎప్పటికైనా ....నిన్ను నే  విడిచేనా ....


No comments:

Post a Comment