Thursday, November 1, 2012

ఎక్కడమ్మా చంద్రుడు



వెండి వెన్నెల ఎండిపోయే
మసక మబ్బులు మూగబోయే
మేఘాల వెనుక దాగిపోయే.... ఎక్కడమ్మా చంద్రుడు
తొంగిచూస్తూ మది అలసిపోయే.... ఎక్కడమ్మా చంద్రుడు


చల్లని గాలిని పిలిచే చేతులు
మల్లెల జల్లులు జాబిలీ చూపులు
మాటలు మేఘమాలకి జోల పాటలు .... ఎక్కడమ్మా చంద్రుడు
ఎదురుచూస్తూ నిలిచిపోయే కన్నులు.....ఎక్కడమ్మా చంద్రుడు

No comments:

Post a Comment